బాసర ఆలయ రూపురేఖలు మార్చేలా మాస్టర్ ప్లాన్: సీఎం రేవంత్
తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలోనే అతి అరుదైన సరస్వతీ దేవి ఆలయాల్లో ఒకటైన బాసర రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) నడుంబిగించారు. ఉన్నతాధికారులతో తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో.. ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం పరిశీలించారు. ఈ ప్లాన్ కేవలం సాధారణ నిర్మాణాలకే పరిమితం కాకుండా.. భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి
పర్యావరణ హితంగా ప్రాంగణం..
పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడటంపై సీఎం రేవంత్ (CM Revanth) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలను పూర్తిగా కాలుష్య రహిత జోన్‌గా (Pollution-Free Zone) మార్చాలని నిర్ణయించారు. గుడి పరిసరాల్లో కేవలం విద్యుత్ వాహనాలను (Electric Vehicles) మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని సీఎం తేల్చిచెప్పారు. గుడి పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం మాత్రమే వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
రూ. 225 కోట్లతో పనులు..
రాబోయే దశాబ్దాల భవిష్యత్ అవసరాలను, పెరుగుతున్న భక్తుల రద్దీని ముందే అంచనా వేసి మాస్టర్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి (CM Revanth) సూచించారు. అక్షరాభ్యాసాలు, వసంత పంచమి వంటి ఉత్సవాల సమయాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు అత్యంత విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 225 కోట్లను కేటాయించింది. ఏప్రిల్ 6వ తేదీన ఈ మహా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఆలయ విస్తరణ, భక్తుల కోసం మెరుగైన వసతి గృహాలు, మోడ్రన్ క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్నారు. తద్వారా బాసర క్షేత్రం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం (CM Revanth) స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








