ప్రజాసమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో : ఎంపీ కేశినేని
పెన్షన్స్ పై తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) వ్యాఖ్యానించారు. విజయవాడలోని 45వ డివిజన్ ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎంపీ శివనాథ్ పాల్గొని మాట్లాడారు. ఆయా సమస్యల పరిష్కరానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని చెప్పుకొచ్చారు. తాము హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేశామని వెల్లడించారు. ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వమని అంటున్నారని తెలిపారు. జగన్ (Jagan) హయాంలో నేతలు, అధికారులు ఎవరు ప్రజల దగ్గరకు వెళ్లింది లేదని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రి లోకేశ్ (Lokesh) సూచనల మేరకు ఈ ప్రజాదర్భార్ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. విజయవాడలోని అన్ని సమస్యలను జిల్లా కలెక్టర్ (District Collector), ప్రజాప్రతినిధులం కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జీవో నంబర్ 30ను తీసుకువచ్చి ప్రతి ఒక్క లబ్దిదారుడుకి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. విజయవాడలో డ్రైనేజీ, కొండ ప్రాంత ప్రజల సమస్యలు త్వరలో పరిష్కారం కాబోతున్నాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








