టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం
టీఆర్ఎస్ పార్టీ తరపున నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. జోగినపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్ లు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, వీరు బుధవారం రాజ్యసభ సభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేశారు. గులాబీ కండువాలు ధరించిన వీరు సభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి నమస్కరించి కరచాలనం చేశారు. వెంకయ్య కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురు తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.













