తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), చైర్మన్ బీఆర్. నాయుడు ( B.R. Naidu), ఈఓ ముద్దాడి రవిచంద్ర, టీటీడీ అధికారులు మరియు అర్చకులు సాదర స్వాగతం పలికారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి, మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ద్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం, గర్భాలయంలోని శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించారు.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపం (Ranganayaka Mandapam)లో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అధికారులు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








