వందేళ్లు చరిత్ర కలిగిన ఏయూ.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఉపరాష్ట్రపతి
విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాలు సాధిస్తే సరిపోదని, కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయం బోధనకే కాకుండా పరిశోధనకు కేంద్రంగా మారాలన్నారు. పేటెంట్లపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, ఫ్యూర్ సైన్సె్స్ పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వందేళ్లు చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. 2025-26లో దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. విశాఖ నగరం ఐటీ, డేటా సెంటర్లు, టూరిజం, గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాష్ట్ర రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధత దక్కడం భవిష్యత్తుకు స్థిరత్వాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. గతేడాది జరిగిన పెట్టుబడుల సదస్సుకు తాను విశాఖ వచ్చానని ఉప రాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ (Google Data Center)కు శంకుస్థాపనతో దేశంలోనే విశాఖ శక్తివంతమైన ఆర్థిక నగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ఏయూ పూర్వ విద్యార్థులు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, సైయంట్ సంస్థ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి, లారస్ ల్యాబ్స్ అధినేత చావా సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు ఎక్స్‌లెన్స్ అవార్డులతోపాటు శతాబ్ది వేడుకల జ్ఞాపికను అందించారు.
ఇవి కూడా చదవండి








