పెట్టుబడులతో ఏపీ చరిత్ర సృష్టిస్తోంది : లోకేశ్
విశాఖ ముఖచిత్రం ఇవాళ్లి నుంచే మారబోతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా (Google AI Data) నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ఏపీ అభివృద్ధిలో పాలుపంచుకొంటున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు కేవలం భూమి పూజ మాత్రమే కాదని, కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని అన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అని అన్నారు. డేటా సెంటర్ ఏర్పాటుకు 2019కు ముందే ప్రస్తావన జరిగిందన్నారు. ఆనాడు అనుకున్న నిర్ణయం ఇవాళ కార్యరూపం దాల్చిందన్నారు.
ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ (Visakha) అనే పవిత్ర పట్టణం ఉండబోతోంది. వైజాగ్ (Vizag) లో జీ అంటే గూగుల్ అనే శబ్ధం మార్మోగబోతోంది. ఐదేళ్ల విధ్వంస పాలనను మనమంతా చూశాం. ఏపీలో పెట్టుబడులంటే భయపడే పరిస్థితి చూశాం. 2024 ఎన్నికల్లో 5 కోట్లు ఆంధ్రులు ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించాం. అధికారంలోకి రాగానే పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో ఉన్నాం. చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ప్రయోజనాలు చూస్తున్నాం. పెట్టుబడులతో ఏపీ చరిత్ర సృష్టిస్తోంది అని అన్నారు.
ఇవి కూడా చదవండి








