వారికి మహిళల గురించి ఏం తెలుస్తుంది? : మంత్రి సంధ్యారాణి
కాపు కులానికి చెందిన వ్యక్తి ఒకరు మరణిస్తే వైసీపీ నాయకులు (YCP leaders) ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) మీదకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhyarani) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల అంగసౌష్ఠవం గురించి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం దారుణం అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే మూడు పార్టీల నాయకులూ కచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. తల్లి (mother)ని, చెల్లి (sister)ని బయటకుతోసి చిన్నాన్నను చంపిన పార్టీ వారికి మహిళల గురించి ఏం తెలుస్తుంది? అని ప్రశ్నించారు.








