రెండేళ్లలో బసవతారకం ఆసుపత్రి మొదటి దశ పూర్తి : బాలకృష్ణ
అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి (Basavatarakam Cancer Hospital) నిర్మాణ పనులను సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ (Hyderabad)లో బసవ తారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతోంది. అమరావతి (Amaravati)లో ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జులైలో పుట్టింగ్ పనులు మొదలు అవుతాయి. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయి.నిర్మాణం కోసం వర్కర్లు పగలూ రాత్రి పని చేస్తున్నారు. వర్షాకాలం పనులు కొంత ఆలస్యం అవొచ్చు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో ఈ ఆస్పత్రి నిర్మిస్తున్నాం అని అన్నారు.








