President Murmu: బెంగాల్లో రాష్ట్రపతికి అవమానం.. మండిపడ్డ ప్రధాని మోదీ!
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో కనీస ప్రోటోకాల్ (Protocol) పాటించకపోవడం, ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని అత్యంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాష్ట్రపతి ఆవేదన..
సిలిగురి వేదికగా జరిగిన ‘9వ అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్’లో పాల్గొనేందుకు ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ముర్ము (President Murmu) పశ్చిమ బెంగాల్‌కు విచ్చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు స్వాగతం పలకాల్సిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, రాష్ట్ర మంత్రులు కానీ ఎవరూ అక్కడకు రాకపోవడం వివాదాస్పదమైంది.
అనంతరం సిలిగురి నుంచి బీధన్నగర్ చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి విశాలమైన వేదికను చూసి సిలిగురి వేదికతో పోల్చుతూ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. “మమతా బెనర్జీ నాకు చెల్లి లాంటిది. బహుశా ఆమె నాపై కోపంగా ఉందేమో? ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని అంత ఇరుకు వేదికపై ఎందుకు నిర్వహించాలనుకుందో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ కార్యక్రమాన్ని ఈ (బీధన్నగర్) వేదికపై నిర్వహించి ఉంటే.. కనీసం ఐదు లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యేవారు” అని ముర్ము (President Murmu) వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
టీఎంసీ హద్దుమీరింది: ప్రధాని మోదీ
రాష్ట్రపతికి (President Murmu) జరిగిన ఈ అవమానంపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “గతంలో ఎన్నడూ చూడని సిగ్గుచేటు చర్య ఇది. రాజ్యాంగాన్ని, ఆదివాసీల సాధికారతను నమ్మే దేశ ప్రజలందరినీ టీఎంసీ తీరు తీవ్రంగా బాధపెట్టింది. దేశ ప్రథమ పౌరురాలు, ఒక ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన ఆవేదన.. దేశమంతటా విషాదాన్ని నింపింది. ఈ విషయంలో టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసింది. రాష్ట్రపతికి (President Murmu) జరిగిన ఈ అవమానానికి బెంగాల్ సర్కారే పూర్తి బాధ్యత వహించాలి” అని మోదీ మండిపడ్డారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ కూడా మమతా సర్కార్‌పై విరుచుకుపడింది. టీఎంసీ రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ పౌరురాలిని (President Murmu) ఈ విధంగా అవమానించడం రాజ్యాంగబద్ధమైన విలువలను పూర్తిగా కించపరచడమేనని తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఇవి కూడా చదవండి








