ప్రధాని మోదీ గెలుపు కోసం… అమెరికాలో
ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయాన్ని కాంక్షిస్తూ అమెరికాలోని పలు నగరాల్లో బీజేపీ మద్దతుదారులు యాగాలు చేపట్టారు. న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, మేరీలాండ్, షికాగోల్లో యాగాలు నిర్వహించినట్లు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. షికాగో శివారులోని ఆలయంలో జరిపిన పవిత్ర చండీ యాగం, వర్జీనియాలోని శ్రీ వెంకటేశ్వర లోటస్ ఆలయంలో జరిగిన గణపతి హోమంలో భారత సంతతికి చెందిన నిపుణులు, వాణిజ్యవేత్తలు, నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








