చైనా దూకుడుకు అమెరికా కళ్లెం
ఇండో పసిఫిక్ వ్యూహాన్ని అమలు చేయడానికి 180 కోట్ల డాలర్లను, అక్కడ చైనా దూకుడును నిరోధించడానికి అదనంగా 40 కోట్ల డాలర్లను కేటాయించాలని అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)ను అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. 2023 సంవత్సరానికి 77,300 కోట్ల డాలర్ల వార్షిక రక్షణ బడ్జెట్ ప్రతిపాదనలను బైడెన్ సర్కారు కాంగ్రెస్కు సమర్పించింది. అందులో భాగంగానే ఈ ప్రతిపాదనలు చేసింది. ఇవి కాకుండా ఉక్రెయిన్లో 68.2 కోట్ల డాలర్లను ప్రతిపాదించింది. అఫ్గానిస్థాన్లో 20 ఏళ్ల యుద్ధాన్ని చాలించి అమెరికన్ సేనలను ఉపసంహరించేటప్పుడే ఇక తాము చైనా, రష్యాల దూకుడును నిరోధించడానికి ఐరోపా, ఇండో పసిఫిక్ మిత్రులతో కలిసి పని చేస్తామని బైడెన్ ప్రకటించారు.













