రష్యాపై విమర్శలు తప్ప.. మా దేశానికి సాయమేది?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఉక్రెయిన్ ఎంపీ సోవ్‌సన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రష్యాపై విమర్శలు చేయడం తప్ప బైడెన్ ఉక్రెయిన్‌కు చేసిన సాయమేమీ లేదని విమర్శించారు. యూరప్ పర్యటనలో భాగంగా బైడెన్ ఇటీవల పోలండ్‌లో పర్యటించారు. రష్యా`ఉక్రెయిన్ యుద్ధంపై ఉక్రెయిన్ అగ్ర నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఉక్రెయిన్ స్పందిస్తూ తనను ప్రేరేపించే, తమ దేశ ప్రజలకు భరోసా ఇచ్చే ఒక్కమాట కూడా బైడెన్ నుండి తాను వినలేదని అన్నారు.













