ట్రంప్ ఆశ థ్యాస .. నోబెల్ బహమతిపైనే..!
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి… ఈసారైనా తనను వరిస్తుందన్న ఆశతో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 8 యుద్ధాలు ఆపి , ప్రపంచంలో శాంతిని నెలకొల్పిన తనకు గతేడాది అన్యాయం జరిగిందన్న భావనలో ఉన్నారు ట్రంప్. అయితే ఈసారి అలా కాకుండా నేరుగా తనకే నోబెల్ బహుమతి వస్తుందని భావిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్, పాకిస్తాన్, కాంబోడియా దేశాలు.. ట్రంప్ ను నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ చేశాయి.
శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీకి 287 నామినేషన్లు రాగా.. అందులో ట్రంప్ (Donald Trump) పేరు ఉందని తెలుస్తోంది.. దీంతో ఈసారైనా ట్రంప్‌ను శాంతి బహుమతి వరిస్తుందా అనే చర్చ మొదలయ్యింది. 208 మంది వ్యక్తులు, 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చినట్లు గురువారం నోబెల్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్ వంటి మరికొంతమంది పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. నామినేషన్లకు సంబంధించిన పేర్లను కమిటీ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. కాబట్టి.. ఈ పేర్లకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ లేదు.
ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై ట్రంప్ భీకర యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు శాంతి చర్చలకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కలలు కంటున్న శాంతి బహుమతి ఆయన్ను వరిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా.. 2026 నోబెల్ శాంతి బహుమతి అక్టోబరు 9న ప్రకటిస్తారు. డిసెంబరు 10న ఓస్లాలో దీన్ని ప్రదానం చేయనున్నారు. ఈ నామినేషన్ల సమర్పణ గడువు జనవరి 31నే ముగిసింది.








