అమెరికాలో మళ్లీ కాల్పులు
అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో కమ్యూనిటీ సెంటర్లో జరిగిన పార్టీలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డారు. పిట్స్బర్గ్కు ఈశాన్యాన 80 కిలోమీటర్ల దూరంలోని చెవీ చేస్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన పార్టీలో కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న 9 మందికి గాయాలయ్యాయని, వారిలో పిట్స్బర్గ్కు చెందిన 22 ఏళ్ల వ్యక్తి మరణించాడని వివరించాడు. కాల్పులు జరిపిన వ్యక్తికి సంబంధించిన సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.













