పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు గిఫ్ట్… ఏమిటో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మధ్యే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‍ను తొలిసారి కలిసిన విషయం తెలుసు కదా. ఈ అగ్ర దేశాల అధ్యక్షులు జెనీవాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‍కు జో బైడెన్ ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. తన ఏవియేటర్ స్టైల్లో ఉన్న అమెరికన్ మేడ్ సన్‍గ్లాసెస్‍ను పుతిన్‍కు బహుమతిగా ఇవ్వడం విశేషం. ఇలాంటి సన్‍గ్లాసెస్ సాధారణంగా మిలిటరీ వాళ్లు ధరిస్తారు. అమెరికా సాయుధ బలగాలు వీటి కోసమే ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 1978 నుంచి ప్రతి నెల 25 వేల సన్‍గ్లాసెస్‍ను అమెరికా సాయుధ బలగాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. 1980ల్లో వచ్చిన టామ్ క్రూజ్ మూవీ టాప్ గన్‍తో ఈ ఏవియేటర్ స్టైల్ సన్‍గ్లాసెస్‍కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు పుతిన్‍కు ఇచ్చిన సన్‍గ్లాసెస్‍కు కూడా ఓ ప్రత్యేకత ఉంది. వీటిని తయారు చేయడానికి ఆరు వారాల సమయం పట్టింది. తయారీలో మొత్తం 200 దశలు ఉండటం విశేషం.