అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో .. భేటీ కాను

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍తో తాను సమావేశం కావడం కానీ, టెహ్రాన్ అణు క్షిపణి కార్యక్రమం గురించి చర్చించడం కానీ జరగబోదని ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైక ఇబ్రహిం రైసీ స్పష్టం చేశారు. గత వారం ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆయన దేశీ విదేశీ పాత్రికేయ ప్రతినిధుల సమావేశంలో ఆయన మొదటి సారి మాట్లాడుతూ తన కఠిన వైఖరికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. 1988 లో దాదాపు 500 మందిని సామూహికంగా మరణశిక్షకు గురి చేసిన సంఘటన గురించి అడగ్గా తనకు తాను మానవహక్కుల రక్షకుడుగా సమర్థించుకున్నారు. ఇరాన్‍పై అణచివేత ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా ఒప్పుకుందన్నారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమం, స్థానిక మిలీషియా మద్దతు గురించి అడగ్గా అవి చర్చించ వలసినవి కావని పేర్కొన్నారు.