భారత సంతతి విద్యార్థికి… ప్రతిష్టాత్మక అవార్డు

భారతీయ అమెరికన్ విద్యార్థికి ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డు దక్కింది. పర్యావరణహితమైన నురుగు ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసినందుకు భారత సంతతి విద్యార్థి సోహి సంజయ్ పటేల్ ప్రతిష్టాత్మకమైన పాట్రిక్ హెచ్ హర్డ్ సస్టైనబిలిటీ అవార్డును గెలుచుకున్నారు. టెక్సాస్ ఉన్నత పాఠశాలలో సోఫోమోర్ అయిన సోహి సంజయ్ పటేల్‍ను 2021 వర్చువల్ రెజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ (ఐఎస్‍ఈఎఫ్)లో పాట్రిక్ హెచ్ హర్డ్ సస్టైనబిలిటీ అవార్డు విజేతగా ప్రకటించారు. ఈ అవార్డును యూఎస్ ఎన్విరాన్‍మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) అందజేస్తోంది. కాగా, ఈ ఆవిష్కరణను 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రభావంతో ప్రేరణ పొంది రూపొందించినట్లు సోహి సంజయ్ తెలిపారు.