భారత్ సరిహద్దులు శతృ దుర్భేద్యాలే..!
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ రక్షణ వ్యూాహాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సంప్రదాయ యుద్ధశైలికి భిన్నంగా డిజిటల్ వార్, రక్షణ వ్యవస్థలను భారత్ సిద్ధం చేసుకుంటోంది. దీనికి గానూ తన అంతరిక్ష రక్షణ వ్యవస్థ కోసం ముూడంచెల వ్యవస్థలను మోహరిస్తోంది. అందులో ప్రధానంగా ఎస్-400 స్క్వాడ్రన్ లను అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది.
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్థాన్ సరిహద్దుల్లో అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను నిర్మిస్తోంది. రష్యా నుంచి మే నెలలో మరో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ భారత్‌కు చేరుకోనుంది. దీన్ని రాజస్థాన్, పంజాబ్ సెక్టార్లలో మోహరించనున్నారు. ఈ ప్రాంతాలకు డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఎస్-400 స్క్వాడ్రన్ ఆ ముప్పును అడ్డుకుని సరిహద్దుల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేస్తుంది.
ఇవి కూడా చదవండి
600 కిలోమీటర్ల నిఘా.. 300 లక్ష్యాలు
ఎస్-400 వ్యవస్థలోని శక్తిమంతమైన రాడార్ … ఒకేసారి 300 లక్ష్యాలను గుర్తించగలదు. ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు కదలికలను పసిగట్టగలదు. దీనివల్ల సరిహద్దుకు అవతల ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను కూడా భారత్ తన భూభాగం నుంచే గమనించవచ్చు. శత్రువులు క్షిపణిని ప్రయోగించే లోపే ఎస్-400 దాన్ని లాక్ చేసి, భారత్ అప్రమత్తం అయ్యేలా చేస్తుంది.
బహుళ అంచెల రక్షణ కవచం
భారత్ కేవలం ఒక్క ఎస్-400 మీదనే ఆధారపడకుండా మూడు రకాల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. సుదూర లక్ష్యాల కోసం (400 కి.మీ) ఎస్-400 సిస్టమ్‌ను సిద్ధం చేసింది. మధ్య శ్రేణి లక్ష్యాల కోసం (150-350 కి.మీ) స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ‘ప్రాజెక్ట్ కుశ’ను వాడుకోనుంది. దగ్గరి లక్ష్యాల కోసం ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన ఎంఆర్-ఎస్ఏఎం, భారత్ తయారు చేసిన సమర్ (ఎస్ఏఎంఏఆర్), ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఉపయోగపడున్నాయి.
పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ
అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా-భారత్ రక్షణ ఒప్పందం ప్రకారం ఈ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. 2026 నాటికి ఐదు స్క్వాడ్రన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హిమాలయాల నుంచి కచ్ వరకు భారత్ చుట్టూ ఒక బలమైన రక్షణ కవచం ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి








