బొడ్డుపల్లి రామభద్రకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
జపాన్-భారత్ మధ్య స్నేహసంబంధాల బలోపేతానికి ఇతోధికంగా కృషి చేస్తున్న బొడ్డుపల్లి రామభద్రకు జపాన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోజెట్ అవార్డును ప్రకటించింది. అస భాను జపాన్ సెంటర్, హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న రామభద్ర భారత్లో జపాన్ సంస్కృతిని పరిచయం చేయటంలో, ఇరుదేశాల మద్య పరస్పర విశ్వాసాన్ని నెలకొల్పటంలో ముఖ్యపాత్ర వహించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అస భాను జపాన్ సెంటర్ను రామభద్ర 1999లో హైదరాబాద్లో ప్రారంభించారని, దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఆయన భారతీయులు, జపానీయులు మధ్య అవగాహనను పెంపొందించటానికి ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు.













