ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాం : జో బైడెన్
ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగలిన మునుపటి అమెరికా పాలకుల నిర్ణయాలకు చింతిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. కాప్ 26 సదస్సులో బైడెన్ మాట్లాడుతూ ఆనాలి నిర్ణయంపై ప్రపంచాన్ని క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. ఈ వేదికపైకి తిరిగిరావడమే కాకుండా, ఇకపై ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. ఇకపై వాతావరణ మార్పుల లక్ష్యాలను సాధించడానికి నిర్దిష్ట కార్యాచరణ, పరస్పర సహకారం అవసరమని నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడంలో సహాయపడటానికి మేము మరింత తోడ్పాలు ఇవ్వాలని అనుకుంట్నుమని బైడెన్ తెలిపారు.













