రష్యాకు మరో బిగ్ షాక్ తగలనుంది!
ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు మరో బిగ్ షాక్ తగలనుంది. యుద్ద కాంక్షతో రగిలిపోతున్న రష్యాపై ఇప్పటికే కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలను విధించిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరో కీలక ఆంక్షను విధించేందుకు సిద్ధమైంది. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా తన చమురు ఎగుమతులను స్వీకరించకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతా ఊహిస్తున్నట్లుగా అమెరికా ఇదే దిశగా నిర్ణయం తీసుకుంటే అది రష్యా ఆర్థిక పతనానికి దారి తీస్తుందన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ దిశగా బైడెన్ కీలక నిర్ణయం తీసుకుంటారో, లేదోన్న దానిపై పెద్ద ఎత్తున చర్య జరుగుతోంది.













