హైడ్రాక్సోక్లోరిక్విన్తో రెమెడెసివిర్ వద్దు!
మధ్యస్థ దశ లక్షణాలున్న కొవిడ్ 19 రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమెడె సివిర్ గురించి అమెరికా ఔషధ, ఆహార నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) కీలక ప్రకటన చేసింది. క్లోరోక్విన్ ఫాస్పేట్ లేదా హైడ్రాక్సోక్లోరిక్విన్తో కలిపి రెమెడెసివిర్ను కొవిడ్ రోగుల చికిత్సకు వాడొద్దని హెచ్చరించింది. ఇలా వాడితే రెమెడెసివర్ సామర్థ్యం తగ్గుతున్నట్టు వెల్లడించింది. కాగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్ 19 రోగులకు మలేరియా చికిత్సకు వాడే క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను వాడొద్దని ఏఫ్డీఏ పేర్కొనడం తెలిసిందే. వైరస్ చికిత్సలో ఈ ఔషధాలు అంత సమర్థమంతంగా పనిచేయట్లేదని సదరు సంస్థ తెలిపింది.






