కొవిడ్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడొద్దు : ఎఫ్‌డీఏ
కొవిడ్ 19కు చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్ర సంస్థ (ఎఫ్‌డీఏ) తెలిపింది. కరోనా వైరస్‌పై చికిత్సలో ఈ మందులు సమర్థంగా వ్యవహరించే అవకాశం లేదని పేర్కొంది. వీటివల్ల కలిగే ప్రయోజనాల కన్నా ముప్పే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దశాబ్దాల నాటి ఈ ఔషధాలను ప్రధానంగా మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఎఫ్‌డీఏ తాజా నిర్ణయం వల్ల ఫెడరల్ ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ ఔషధాలను రాష్ట్ర, స్థానిక అధికారులకు పంపిణీ చేయడం కుదరదు.






