జూన్ 20న టెన్నెసీ తెలుగు సమితి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం!
TTS: టెన్నెసీ తెలుగు సమితి (TTS), అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్త భాగస్వామ్యంతో ఒక విశిష్టమైన రక్తదాన శిబిరాన్ని (Blood Drive) నిర్వహించనుంది. సమాజ సేవలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని ప్రవాస తెలుగు వారందరినీ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
శిబిరం వివరాలు..
- తేదీ: జూన్ 20, 2026.
- సమయం: ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు.
- వేదిక: ది జాన్ పి. హోల్ట్ బ్రెంట్వుడ్ లైబ్రరీ (The John P. Holt Brentwood Library), 8109 కాంకర్డ్ రోడ్, బ్రెంట్వుడ్, TN.
రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు..
మీరు ఇచ్చే ఒక్క రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదు. రక్తదానం చేయాలనుకునే వారు తమకు వీలైన సమయాన్ని (Timeslot) ముందుగానే ఎంచుకోవచ్చు.
రిజిస్ట్రేషన్..
ఆసక్తి గల వారు కింది లింక్ ద్వారా లేదా పోస్టర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు:
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/GZodHPCh3UCxX7GSA.
మరింత సమాచారం కోసం వీరిని సంప్రదించవచ్చు.
- హారిక కనగాల: 615-974-1598.
- ప్రవీణ్ రాచ: 602-421-0318.
- వెబ్సైట్: Redcrossblood.org.
ఒకరి జీవితంలో అద్భుతాన్ని నింపేందుకు ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని టెన్నెసీ తెలుగు సమితి ప్రతినిధులు కోరుతున్నారు.








