తెలుగు కళాసమితి ఎన్నికల షెడ్యూల్ ఇదే!
అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న తెలుగు కళాసమితి (టీఎఫ్ఏఎస్) సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నామినేషన్లను వెనక్కు తీసుకోవడానికి ఫిబ్రవరి 25వ తేదీ వరకు వీలుంటుంది. ఆ మరుసటి రోజు, అంటే ఫిబ్రవరి 26వ తేదీన టీఎఫ్ఏఎస్ వెబ్సైటులో నామినీల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 16న అర్హులైన ఓటర్లందరికీ టెస్ట్ మెయిల్స్ పంపడం జరుగుతుంది. ఆ తర్వాత పది రోజులకు, అంటే మార్చి 26న టీఎఫ్ఏఎస్ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. తర్వాత రెండ్రోజుల్లోనే, అంటే మార్చి 28వ తేదీన ఎన్నికల ఫలితాలను టీఎఫ్ఏఎస్ వెబ్సైటులో ప్రచురించడం జరుగుతుంది.













