ఆస్టిన్ లో తానా పాఠశాల పాఠ్యపుస్తకాల పంపిణీ
స్థానిక ఆస్టిన్ రీజియన్లో తానా పాఠశాల మూడవ విద్యా సంవత్సరం 2022-23 సంవత్సరానికి తరగతులు ప్రారంభించి, పుస్తకాల పంపిణీ కార్యక్రమం తానా మరియు పాఠశాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గార్లు వీడియో కాల్ ద్వారా చిన్నారులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల గారు డల్లాస్ నుండి ఆస్టిన్ కి విచ్చేసి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులైన రజని మారం, వర్ధిక, శ్రీనివాసరావు ఇరువంటి, రామ్ శ్యాము భమిడిపాటి, కీర్తి సుస్మిత బుద్ధ మరియు లక్ష్మి పైడి గార్లను ఘనంగా సత్కరించారు. మురళీ తాళ్లూరి గారిని, రజని మారం గారిని, రాము మారం గారిని ప్రత్యేకంగా అభినందించారు. తానా మరియు పాఠశాల కో ఆర్డినేటర్లు సమన్వయంతో పని చేసి, ఈ కార్యక్రమం మరింత విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు.
తానా జాయింట్ సెక్రటరీ మురళీ తాళ్లూరి గారు మరియు రామ్ మారం గారు మాట్లాడుతూ ఆస్టిన్ లో తానా పాఠశాలను బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న ఆస్టిన్ పాఠశాల ఉపాధ్యాయులకు, తానా మరియు పాఠశాల కార్యావర్గానికి ధన్యవాదములు తెలిపారు.
రజని మారం గారు ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ, టీమ్ ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన సాయి విష్ణుబొట్ల గారు, ప్రసన్న గారు చిన్నారులను, కార్యవర్గాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో తానా మరియు పాఠశాల కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.













