అక్టోబర్ 8న న్యూయర్క్ టైమ్ స్క్వేర్ లో తానా ‘బతుకమ్మ’ వేడుక

తెలంగాణా సంస్కృతి ని చాటి చెప్పే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. అక్టోబర్ 8న హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పేర్కొనే న్యూయర్క్ టైమ్ స్క్వేర్ లో ని డప్పీ స్క్వేర్ లో తానా బతుకమ్మ పండుగను అంగ రంగ వైభవంగా నిర్వహించబోతోంది. ఈ పండుగను దిగ్విజయంగా నిర్వహించి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం మాతృభూమి సంప్రదాయ కీర్తి పతాకను రెప రెప లాడిద్దాం. మన జీవన మూలాల్లోని అమూల్యమైన పావన విలువల్ని విశ్వ వ్యాప్తం చేద్దాం. రక రకాల పూలతో, బతుకమ్మను అలంకరించి ఆట పాటలతో ఆ తల్లిని మనసారా అర్చన చేద్దాం. తరతరాల తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు పట్టు కొమ్మ లు గా నిలుస్తున్న సాంస్కృతిక సంస్థలకు, తెలంగాణా ను సకల కళల మాగాణీ గా ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు, అభిమానులంతా ఈ పండుగలో పాల్గొనాలని తానా ఆహ్వానిస్తోంది. ఈ వేడుకను రావాలనుకున్నవారికోసం బస్సులను కూడా తానా ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఫారంను పూర్తి చేసి పంపాల్సిందిగా కోరుతోంది.
http://bit.ly/bathukammabusfacility