మే 3న శాన్ డియాగోలో ఉగాది సంబరాలు!
SANTA: శాన్ డియాగో తెలుగు అసోసియేషన్ (SANTA) ఆధ్వర్యంలో ‘ఉగాది ఉల్లాసం’ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈవెంట్ వివరాలు..
- తేదీ: మే 3, 2026 (ఆదివారం).
- సమయం: మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు.
- వేదిక: కాలిఫోర్నియా సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (340 N Escondido Blvd, Escondido, CA).
ఇవి కూడా చదవండి
కార్యక్రమ విశేషాలు..
స్థానిక కళాకారులు ప్రదర్శించే 35కు పైగా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ వేడుకలో ప్యారడైజ్ బిర్యానీ పాయింట్ , కర్రీ పిజ్జా పాయింట్ వారు ప్రత్యేక ఆహార భాగస్వాములుగా ఉండి రుచికరమైన విందును అందించనున్నారు. ఈవెంట్ ప్రాంగణంలో ప్రత్యేక బజార్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ వేడుకకు హాజరుకావాలనుకునే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. వేదిక వద్ద టికెట్ల విక్రయం ఉండదు. ఆసక్తి గల వారు www.manasanta.org వెబ్సైట్ ద్వారా లేదా ఇమేజ్‌లో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి టికెట్లు పొందవచ్చు.
ఈ కార్యక్రమానికి గ్రాండ్ డోనర్‌గా మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి (SANTA చైర్మన్), డోనర్‌గా డాక్టర్ స్మితా రెడ్డి (MD) వ్యవహరిస్తున్నారు. రవి (ప్రెసిడెంట్), మంజు (వైస్ ప్రెసిడెంట్), రామ్ (సెక్రటరీ) నేతృత్వంలోని టీమ్ ఈ వేడుకలను పర్యవేక్షిస్తోంది.
ఇవి కూడా చదవండి








