న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా “బోనాల జాతర“

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association-NYTTA) బోనాల పండుగను ఆదివారం జులై 28 న బెల్మంట్ స్టేట్ పార్క్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా 800లకు పైన భక్తులు హాజరై మహంకాళి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రాలలో మహిళలు పెద్ద ఎత్తులో హాజరై బోనాలతో ఊరేగింపుగా, పోతురాజు మరియు డప్పుల ఆటపాటలతో ఎంతో చూడ ముచ్చటగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని, ఎల్లమ్మ, పోచమ్మ, మహంకాళి అమ్మ, పోలేరమ్మ అంటూ భక్తి తో నైవేద్యంని సమర్పించి, కల్లు మరియు బెల్లం శాఖలతో పూజించడం జరిగింది.
ఈ సందర్భంగా నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ బోనాల జాతరకి వచ్చిన అందరికి ప్రత్యేక ధన్యవాదనలు తెలియచసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ ధూమ్ ధామ్ వ్యవస్థాపకులు మరియి మాజీ తెలంగాణ MLA రసమయి బాలకిషన్ గారిని వాణి గారు పరిచయం చేసారు. రసమయి గారు మంచి జనపదాలు పాడి అమెరికాలో ఇంత పెద్ద మొత్తంలో బోనాలను జరుపుకోవడం గురించి చాలా ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని వ్వక్త పరచడం జరిగింది. ఇండియాలో కన్నా ఇతర దేశాలలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తున్న మీ అందరికి అభినందనలు అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ దాత Dr.పైల్లా మల్లా రెడ్డి గారు వారి సతీమణి సాధన గారు హాజరుఅయ్యారు.
ఈ సందర్బంగా బోనాలు మరియు అమ్మవారి అలంకరణ వేదిక చూపరులను కట్టిపడేసినది.
కార్యక్రమంలో చిన్నారులకోసం కార్నివల్ గేమ్స్, కాటన్ క్యాండీ, టగ్ అఫ్ వార్ ఆటలతో సహా, లక్కీ డ్రా లో గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్, జ్యువలరీ గిఫ్ట్ లను పంచారు.
బోనాల పండుగకు గాను మంచి రుచికరమయిన తెలంగాణ వంటకాలను అతిధులు ఆరగించారు. హాజరైన సభ్యులందరికి ఫ్రూట్ జ్యూస్, గోలి సోడాలు మరియి ఐస్క్రీమ్లు ఏర్పాటుచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో “పోతరాజు” వేషధారణతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అశోక్ చింతకుంట గారిని, తనకి మేకప్ వేసిన వారి శ్రీమతి మాధవి సోలేటి గారిని ఈ సందర్భంగా సత్కరించారు.
చివరగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజవంతం చేయడంలో సహకరించిన తన కార్యవర్గానికి, బోర్డు అఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ కమిటీ మరియు కార్యక్రమనికి సహకరించిన వాలంటీర్స్ కి ప్రెసిడెంట్ వాణి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆహూతులంతా ఈ బోనాలు జాతర న్యూయార్క్ నగరంలో అత్యంత అద్భుతంగా న భూతో న భవిష్యత్ గా జరిగింది అనడంలో సందేహం లేదు అని అభినందించారు.