ముఖ్యమంత్రి కెసిఆర్, కడియం శ్రీహరి కి ధన్యవాదాలు తెలిపిన మహేష్ బిగాల
ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన సందర్బంగా ఎన్నారై టి ఆర్ ఎస్ సమన్వయకర్త మహేష్ బిగాల ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారిని కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్స్ రిజర్వేషన్ కేటాయించడం వలన తెలంగాణ విద్యార్థులకు లాభం చేకూరుతది అన్నారు. అంతర్జాతీయ విద్య సంస్థలతో ఎంఓయూ లు చేసుకోవడం వలన ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ, పరిశోధనలు, ఉద్యోగ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపుచ్చుకోవడానికి ఈ ప్రయివేటు యూనివర్సిటీలు దోహదం చేస్తాయని అన్నారు.













