వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఇళయరాజా సంగీత విభావరి
వాషింగ్టన్ తెలుగు సమితి ‘వాట్స్’ ఆధ్వర్యంలో ఇళయరాజా సంగీత విభావరి ఘనంగా జరిగింది. ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులు ఎన్నో మంచి హుషారు గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ తెలుగు సమితి ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి మరియు కార్యవర్గం గౌరవనీయులు మాస్ట్రో ఇళయరాజాని శాలువా, మెమెంటోతో సత్కరించి ‘‘స్వర రాజాధి రాజా’’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. స్థానిక ఏంజెల్ ఆఫ్ ది విండ్స్ ఎరీనా లో జులై 9 శనివారం రోజున నిర్వహించిన ఈ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ లో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు.













