మేరీలాండ్ లో భయానకంగా మారిన పరిస్థితి
అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షం భయానక వాతావరణాన్ని సృష్టించింది. బాల్టిమోర్కు 13 ఏళ్ల దూరంలో ఇల్లికాట్ సిటీలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీగా ఏర్పడిన వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు ఇళ్లు నేలకూలాయి. వరదల్లో కార్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తు ప్రాణాంతకమని జాతీయ వాతావరణ సేవల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మేరీలాండ్ గవర్నర్ లారీ హోగాన్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇదే ఇల్లికాట్ నగరంలో రెండేళ్ల క్రితం వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయని ఆయన గుర్తు చేశారు. ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియో అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అనేక కార్లు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం సృష్టంగా కనిపిస్తోంది.













