APNRT ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్
విదేశాల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు 50 వేల రూపాయల వరకు ఎక్స్ గ్రేషియా
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు APNRT ద్వారా పథకం అమలు
ప్రవాసాంధ్రుల భద్రత, సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సామాజిక, ఆర్థిక, చట్టపరమైన సేవలను వారికి అందించడం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ APNRT.
CM చంద్రబాబు గారు ప్రకటించిన మైగ్రేషన్ పాలసి ప్రకారం, ప్రవాసాంధ్రులు ఎవరైనా విదేశాలలో చనిపోయినట్లయితే, ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందించాలనే సదుద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపిఎన్ఆర్టి భాధితులకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందచేస్తుంది.
విదేశాలనుండి మృతదేహం తరలింపుకు ఒక లక్ష రూపాయల వరకు సంబంధిత వ్యక్తులు పెట్టిన ఖర్చులను రీయంబర్స్మెంట్ కూడా APNRT చేస్తుంది. మృతదేహం తరలింపుకు కంపెనీ స్పాన్సర్ / ఇండియన్ ఎంబసీ /ఇండియన్ హై కమిషన్/ సోషల్ వర్కర్/ ఎన్.జి.ఓ నుండి ఆర్ధికసాయం అందించినచో ఇది వర్తించదు.
అంతేకాకుండా ప్రవాసాంధ్రులలో ఎవరైనా విదేశాలలో చనిపోయినట్లయితే ఆ వ్యక్తి మృత దేహాన్ని ఎయిర్ పోర్ట్ నుండి సొంత గ్రామాలకు తరలించడానికి సహాయం చేస్తుంది.
ప్రవాసాంధ్రులు విదేశాలలో ఆసుపత్రి పాలై ఉద్యోగం కోల్పోయిన వారికి ఆసుపత్రి ఖర్చుల కింద డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం ఒక లక్ష రూపాయల వరకు రీయంబెర్స్మెంట్ మరియు వారికి అవసరమైతే డాక్టర్ సూచనల మేరకు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తుంది.
మరణించిన వారి కుటుంబ సభ్యులు ఎలా అప్లై చేసుకోవాలి.
ఏపిఎన్ఆర్టి కో-ఆర్డినేటర్ల ద్వారా
భాధిత కుటుంబ సభ్యులు నేరుగా ఏపిఎన్ఆర్టి ఆఫీసుకు వచ్చి
సోషల్ వర్కర్స్ ద్వారా
ఎన్ జి ఓ ల ద్వారా వీరు అభ్యర్ధనలు పంపవచ్చు
ఎవరు అర్హులు…
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు వ్యక్తి మరణించిన సంవత్సరంలోపు ధరకాస్తు చేసుకోవాలి.
జతపరచవలసిన డాక్యుమెంట్లు
(ఎ) మృతి చెందిన ఎడల:
- నామినీ లబ్దిదారుని యొక్క గుర్తింపు కార్డు – రేషన్ కార్డు, ఆధార్ కార్డు
- వైద్య సర్టిఫికెట్లు
- సంబంధిత దేశంలోని ఇండియన్ ఎంబసీ/ఇండియన్ హై కమిషన్ జారీ చేసిన మరణ ధృవపత్రాలు (స్వదేశంలో చనిపోయినట్లయితే మరణ ధృవీకరణ పత్రం తో పాటు ఆ సమయానికి NRT అని నిరూపించే ధ్రువ పత్రం / వీసా కాపీ)
- రద్దు చేయబడ్డ పాస్పోర్ట్
- ఫ్యామిలి మెంబర్ సర్టిఫికేట్
(బి) ఫైనాన్షియల్ విషయంలో
- గుర్తింపు కార్డు – రేషన్ కార్డు / ఆధార్ కార్డు / పాస్పోర్ట్
- వైద్య సర్టిఫికెట్లు
- అనారోగ్య కారణం గా ఆ యా యాజమాన్యం ఉద్యోగ ఒప్పందం రద్దు చేసినట్లు నిర్ధారించే డాక్యుమెంట్లు













