నిర్మాతలకు ఆర్థిక ఒత్తిడి తెస్తున్న స్టార్ల సినిమాలు
రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన ప్రెస్టిజ్ గ్రూపు(Prestige Group) తాజాగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి KVN ప్రొడక్షన్స్ పేరుతో భారీ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇందులో తమిళ స్టార్ విజయ్(Vijay) నటించిన జన నాయగన్(Jana Nayagan), కన్నడ స్టార్ యష్(Yash) నటించిన టాక్సిక్(Toxic) సినిమాలు ఇండస్ట్రీలో భారీ అంచనాలను సృష్టించాయి. రికార్డు స్థాయిలో ప్లాన్ చేసిన ఈ సినిమాల షూటింగ్ పూర్తయ్యినా, రిలీజ్ దశలో మాత్రం అనుకోని సమస్యలు నిర్మాతలను ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా జన నాయగన్ సినిమా సెన్సార్ సమస్యలతో నిలిచిపోవడం కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి
జననాయగన్ సినిమా నిర్ణయించిన బడ్జెట్లోనే సమయానికి పూర్తయినప్పటికీ, సెన్సార్ అనుమతుల్లో జాప్యం కారణంగా రిలీజ్ నిలిచిపోయింది. ఇదే సమయంలో సినిమా ఆన్లైన్లో లీక్ కావడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) డిజిటల్ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం నిర్మాతలకు కోట్లలో నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికెట్ కోసం టీమ్ ఎదురుచూస్తుండగా, ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు.
ఇక టాక్సిక్ విషయానికి వస్తే, ఈ సినిమా ఒక సంవత్సరం పైగా ఆలస్యమైంది. మొదటగా జూన్ 4న రిలీజ్కు ప్లాన్ చేసిన ఈ సినిమా, రీషూట్లు మరియు ఇతర కారణాలతో వాయిదా పడింది. బడ్జెట్ కూడా రెట్టింపైందని, రెండు సినిమాలపై కలిపి దాదాపు రూ.1000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం వల్ల వడ్డీ భారం పెరుగుతూ ఉండటంతో KVN ప్రొడక్షన్స్ ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. త్వరలోనే ఈ సినిమాలను విడుదల చేసి ఈ ఒత్తిడి నుంచి బయటపడాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








