Samantha: ఫోటోగ్రాఫర్లపై సామ్ అసహనం

సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వారిని ఎంతోమంది ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు బయట కనిపించడం ఆలస్యం ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సార్లు దీన్ని ఎంజాయ్ చేసినా, ఇంకొన్ని సార్లు సదరు సెలబ్రిటీలకు ఇబ్బందిగానే అనిపిస్తుంది.
తాజాగా స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. పాన్ ఇండియా లెవెల్ లో సమంతకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ లోనే కాదు, ఆఫ్ లైన్ లో కూడా సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎక్కడ కనిపించినా తన ఫ్యాన్స్, ఫోటోగ్రాఫర్లు చేసే రచ్చ మామూలుది కాదనే సంగతి కూడా తెలుసు. సమంతను ఇప్పుడు ముంబైలోని ఫోటోగ్రాఫర్లు అసహనానికి గురయ్యేలా చేశారు.
సమంత జిమ్ లో వర్కవుట్ చేసి బయటికొస్తున్న టైమ్ లో ఆమెను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నా, ఫోటోగ్రాఫర్లు ఆమె చుట్టుముట్టడం వల్ల సహనం కోల్పోయిన సమంత స్టాప్ ఇట్ గయ్స్ అంటూ వారిపై మండిపడింది. స్టార్ హీరోయిన్ ను ఫోటోగ్రాఫర్లు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో ఆ వీడియో కింద నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ముంబైలో రానా(Rana)ను కూడా ఫోటోగ్రాఫర్లు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.