Power Peta: సందీప్ సరసన మిరాయ్ బ్యూటీ
హీరో సందీప్ కిషన్(sundeep kishan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తర్వాత మరోసారి పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరీర్ ప్రారంభంలో ప్రస్థానం వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన సందీప్, తర్వాత తెలుగు, తమిళ భాషల్లో విభిన్న కథలను ఎంచుకొని తన మార్క్ కొనసాగించారు. అయితే, స్టార్ స్థాయి గుర్తింపు ఇంకా ఆయనకు దక్కలేదు. గతేడాది రిలీజైన మజాకా(mazaka) బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని పొందకపోవడంతో, ఈసారి బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు.
ఈ నేపథ్యంలోనే సందీప్ పవర్ పేట(power peta) అనే సినిమాను చేయబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామాలో సందీప్ పాత్రకు మాస్ మరియు ఎమోషనల్ షేడ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొదట ఈ కథను యంగ్ హీరో నితిన్(nithin) తో తెరకెక్కించాలని భావించినప్పటికీ, ఆ ఆలోచన మళ్ళీ మారి సందీప్ కిషన్ వైపు వెళ్లింది. కృష్ణ చైతన్య(krishna chaitanya) దర్శకత్వంలో, 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్(70 MM Entertainments) బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతోంది. మొదట మూడు భాగాలుగా ప్లాన్ చేసిన కథను, తర్వాత ఒకే భాగంగా తీసుకురావాలని నిర్ణయించారని సమాచారం.

ఇవి కూడా చదవండి
హీరోయిన్ గా మిరాయ్(mirai) ఫేమ్ రితికా నాయక్(rithika nayak) సందీప్ సరసన నటించనున్నారు. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ(anand devarakonda), వరుణ్ తేజ్(varun tej) వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న రితిక, పవర్ పేట ద్వారా మరింత గుర్తింపు పొందనున్నారు. అదనంగా, సందీప్ డిజిటల్ స్పేస్‌లో అడుగుపెట్టి, సూపర్ సుబ్బు(super subbu)ను చేస్తున్నాడు. ఇది త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే, తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్(jason sanjay) దర్శకత్వంలో సిగ్మా(sigma)లో కూడా నటిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా వెంకటాద్రి టాకీస్(venkatadri talkies) ద్వారా రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేసి, విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న సందీప్‌కు పవర్ పేట కీలక మలుపుగా మారవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








