Sundeep Kishan: సర్జరీకి భయపడుతున్న యంగ్ హీరో

ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు కూడా సమస్యలు సాధారణమే. అయితే తమ సమస్యలను కొందరు బయటపడి చెప్పుకుంటే మరికొందరు మాత్రం తమలోనే దాచుకుంటూ ఉంటారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ఓ అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారట. అదే సైనస్. గత కొన్నేళ్లుగా తాను సైనత్ తో ఇబ్బంది పడుతున్నట్టు సందీప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
షూటింగ్ గ్యాప్ లో కారావ్యాన్ లోకి వెళ్లి నిద్రపోయినప్పుడు తన ముక్కు నుంచ వెనుక భాగం వరకు మొత్తం బ్లాకవుతుందని, ప్రతీ రోజూ ఉదయం కూడా నిద్ర లేవగానే ఈ సమస్య తనను వేధిస్తుందని వెల్లడించారు సందీప్. అందుకే ఉదయం లేచిన వెంటనే టీ తాగి, మెడిటేషన్ తో పాటూ స్తోత్రాలు వినే వరకు ఎవరితో మాట్లాడనని సందీప్ వెల్లడించారు.
ఈ సమస్యను అధిగమించుకోవడానికి సర్జరీ చేయించుకోవాలని, కానీ ఆపరేషన్ వల్ల ముక్కు, ముఖం మారిపోతుందేమోనని భయమేసి సర్జరీ గురించి ఆలోచించడం లేదని సందీప్ తెలిపారు. అంతేకాకుండా సర్జరీ తర్వాత నెల రోజుల పాటూ షూటింగ్స్ ఏమీ లేకుండా ఉండాలని ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడాలని అందుకే తనకు సర్జరీ అంటే భయమని సందీప్ పేర్కొన్నారు.