Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(samantha) ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడింది. తన కెరీర్లో కొత్త ఛాప్టర్ మొదలైందని, ఆ జర్నీ ద్వారా ఇతరులకు స్పూర్తిని ఇవ్వాలని తాను అనుకుంటున్నట్టు చెప్పింది. స్టార్‌డమ్ పర్మినెంట్ కాదని, యాక్టర్ల లైఫ్ లో అవి కొంతకాలం మాత్రమే ఉంటాయంది.
ఒక దశలో ప్రేక్షకుల కొత్త ముఖాలను వెల్‌కమ్ చేస్తూ, కొత్త కథలపై ఆసక్తి చూపిస్తారని, ఆ సమయాన్ని గుర్తించి తమను తాము ఎలా మార్చుకుని తమ ఎఫెక్ట్ ను సమాజంపై ఎలా చూపిస్తారనేదే అసలైన సక్సెస్ అని సమంత చెప్పారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు జర్నీ చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంటుందని, ఛాన్సులు కూడా చాలా తక్కువగానే వస్తాయని చెప్పింది సమంత.
తన సక్సెస్‌లు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పిన సమంత, స్టార్ గా ఉన్నప్పుడు కొందరికి స్పూర్తిగా ఉండటం, ఒకరికైనా మార్గదర్శకురాలిగా ఉండగలగడం నిజమైన శాటిస్‌ఫ్యాక్షన్ ను ఇస్తుందని సమంత పేర్కొంది. ప్రతీ మహిళ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని, ఏ విషయంలోనైనా ఎలాంటి భయం లేకుండా రిస్క్ తీసుకునే వాళ్లే సక్సెస్ అవుతారని సమంత చెప్పింది.