Amaravati: కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం : అనిత
                                    రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) అన్నారు. తుళ్లూరులో డీఎస్పీ కార్యాలయాన్ని (DSP office) ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం. పోలీసుల (Police) కు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వారి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తాం. ప్రతిపక్షాల ఆరోపణలను దీటుగా ఎదుర్కొంటాం. పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. సామాజిక మాధ్యమాల్లో (Social media) తప్పుడు పోస్టులను సహించం. పోలీసులకు నూతన సాంకేతికతను అందిస్తాం. 6100 పోస్టులను భర్తీ చేస్తున్నాం అని అన్నారు.







