Sleep Apnea: నిద్రలో మీకు తెలియకుండానే శ్వాస ఆగిపోతుందా? ఈ వ్యాధి కావచ్చు .. జాగ్రత్త!
హైదరాబాద్: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ‘స్లీప్ ఆప్నియా’ ఒకటి. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియకు ఆటంకం కలగడం వల్ల గాఢ నిద్ర కరువై, మనిషి తీవ్ర అస్వస్థతకు గురయ్యే పరిస్థితి ఇది.
స్లీప్ ఆప్నియా అంటే ఏమిటి?
ఇది నిద్రకు సంబంధించిన ఒక జబ్బు. నిద్రపోతున్న సమయంలో శ్వాసనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల గాలి పీల్చుకోవడం పదేపదే ఆగిపోతుంది. ప్రతిసారి శ్వాస ఆగినప్పుడు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి మెదడు అప్రమత్తమవుతుంది. దీనివల్ల వ్యక్తికి తెలియకుండానే నిద్రకు ఆటంకం కలుగుతుంది.
లక్షణాలు:
- విపరీతమైన గురక: నిద్రలో బిగ్గరగా గురక పెట్టడం, మధ్యమధ్యలో ఊపిరి ఆగిపోయినట్లుగా శబ్దాలు రావడం.
- పగటిపూట నీరసం: రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల పగలు విపరీతమైన అలసట, నిద్రమత్తుగా అనిపించడం.
- ఉదయం తలనొప్పి: నిద్రలేవగానే తల భారంగా ఉండటం.
- ఏకాగ్రత దెబ్బతినడం: పనులపై శ్రద్ధ పెట్టలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం.
- ఉక్కిరిబిక్కిరి కావడం: నిద్రలో ఒక్కసారిగా గాలి అందక మెలకువ రావడం.
నిర్లక్ష్యం చేస్తే కలిగే ప్రమాదాలు: స్లీప్ ఆప్నియాను సాధారణ సమస్యగా భావించి వదిలేస్తే అది ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా,
- గుండె సంబంధిత వ్యాధులు (Heart Diseases)
- అధిక రక్తపోటు (High BP)
- స్ట్రోక్టై, ప్-2 డయాబెటిస్
వైద్యుల సూచన: మీకు పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. డాక్టర్లు ‘స్లీప్ స్టడీ’ (Sleep Study) ద్వారా సమస్య తీవ్రతను గుర్తించి, సిపాప్ (CPAP) వంటి చికిత్సలను లేదా జీవనశైలి మార్పులను సూచిస్తారు. సరైన చికిత్సతో ఈ సమస్యను అధిగమించి హాయిగా నిద్రపోవచ్చు.






