TDP : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరైన తిరువూరు ఎమ్మెల్యే
                                    తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Shivnath) (చిన్ని), కొలికపూడి మధ్య వివాదం నేపథ్యంలో ఇరువూరు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని ఇటీవల పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తో పాటు క్రమశిక్షణ కమిటీలోని కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) ఎదుట ఆయన హాజరై వివరణ ఇచ్చారు.







