Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి

సౌత్ ఇండియన్ సినిమాలో అనుష్క శెట్టి(Anushka Shetty)కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి స్టార్ స్టేటస్ ఉన్న అనుష్క నుంచి రీసెంట్ గా వచ్చిన ఘాటీ(Ghaati) సినిమాకు మొదటి నుంచే మిక్డ్స్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘాటీ డిజాస్టర్ గా నిలిచింది. క్రిష్(krish) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్(UV Creations) నిర్మించింది.
అనుష్క(anushka) ప్రమోషన్స్ కు రాకపోవడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా రాలేదు. అనుష్క మినహా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ భారాన్ని తమ నెత్తిపై వేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఘాటీ సినిమా తర్వాత అనుష్క పై ఫ్యాన్స్ నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమెను స్లిమ్ గా చూపించడానికి వాడిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ను చూడలేకపోయామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పైగా సినిమా ప్రమోషన్స్ కు అనుష్క రాకపోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అనుష్కకు ఫ్లాపులున్నప్పటికీ ఆమె చేసిన అరుంధతి(arundhathi), భాగమతి(bhagamathie) సినిమాల్లోని స్క్రీన్ ప్రెజెన్స్ ను, యాక్టింగ్ ను ఆడియన్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆ సినిమాలతో అనుష్క అంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలిగారు. అలాంటి ఆమె తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలంటే మచి కథలను ఎంచుకుని వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దాంతో పాటూ ప్రమోషన్స్ లో కూడా అనుష్క పాల్గొనాలని అప్పుడే ఆడియన్స్, ఆమెతో కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉండి, సినిమాపై మంచి ప్రభావం చూపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో అనుష్క ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.