Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు

జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్ (Manipur) లో పర్యటించారు. ఆయన పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వయనాడ్‌లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపుర్ లో ఘర్షణలు జరిగిన రెండేల్ల తర్వాత ప్రధాని మోదీ (Modi) అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్ (India) లోని ప్రధానమంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అందరూ ప్రధానులు ఇదే పాటించారని తెలిపారు. కానీ, మోదీ మాత్రం రెండేళ్ల తర్వాత దీన్ని పాటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పటికే అక్కడ పర్యటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.