పాగల్ ని కట్టిపడేసిన హీరోయిన్..
యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పాగల్. నరేష్ కొప్పల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి స్పందన తెచ్చుకున్నాయి. విభిన్నమైన సినిమాలు చేస్తూ యూత్ ఆడియన్స్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్.. ఈసారి ప్రేమలో ప్రతి ఒక్కడు పాగల్ అంటూ మ్యాజికల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో సిమ్రాన్, మేఘ లేఖ హీరోయిన్లు గా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ క్రమంలో తాజాగా నివేదా పేతురాజ్, మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నివేదా ఇందులో తీరా అనే పాత్రలో నటిస్తున్న క్యారెక్టర్ రివీల్ చేస్తూ పోస్టర్ లో తెలిపారు. ఈ రొమాంటిక్ పోస్టర్ లో విశ్వక్ చేతులు వెనక్కి కట్టివేయబడున్నాయి. నివేదా అతన్ని గట్టిగా హగ్ చేసుకుని కనిపిస్తోంది. పాగల్ చిత్రానికి రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. రాహుల్ రామకృష్ణ , మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు పాగల్ ని సమ్మర్ కానుకగా మే 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.













