ట్రెండీ అనార్కలీలో నభా గ్లామర్ ట్రీట్
నభా నటేష్(Nabha Natesh) గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన నభా మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.


తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న నభాకు ఆ తర్వాత పెద్దగా కలిసిరాలేదు. మధ్యలో యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయింది.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నభా, తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆరెంజ్ కలర్ లాంగ్ అనార్కలీ డ్రెస్ లో తన అందాల్ని ఎలివేట్ అయ్యేలా పోజులిచ్చి, వాటితో కుర్రాళ్ళకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.


అనార్కలీలో కూడా ఈ రేంజ్ అందాల ఆరబోత చేయొచ్చా అని షాకవుతూ కొందరు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి








