పవర్, పర్పస్ కలిస్తే సంచలనమే!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో జోరు కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో NBK111 షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన, తన 112వ సినిమాను అధికారికంగా ప్రకటించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ(Koratala Siva)తో చేతులు కలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలయ్య(balayya) మాస్ ఇమేజ్‌కు సరిపోయేలా పవర్ఫుల్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
ఇవి కూడా చదవండి
కొరటాల శివ సినిమాల ప్రత్యేకత అయిన సోషల్ మెసెజ్, మాస్ ఎలిమెంట్స్ కలయిక ఈ ప్రాజెక్ట్‌లోనూ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఎ మూమెంట్ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజైన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కథ వినగానే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, తన పాత్ర రూపకల్పనపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపినట్లు సమాచారం. మాస్ యాక్షన్‌తో పాటూ ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యమిచ్చే స్క్రీన్‌ప్లేను కొరటాల సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2026 సెకండాఫ్ లో ప్రారంభం కానుందని సమాచారం. యువసుధ ఆర్ట్స్(Yuvasudha Arts) బ్యానర్ లో సుధాకర్ మిక్కిలినేని(Sudhakar mikkilineni) ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న పీరియడ్ డ్రామాతో పాటు, ఈ మాస్ ఎంటర్టైనర్తో బాలయ్య తన హిట్ ట్రాక్‌ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.








