సీఎం సహాయ నిధికి టాలీవుడ్ ప్రముఖుల విరాళాల వెల్లువ.. ఎవరెంతిచ్చారంటే?
హైదరాబాద్‌ని వర్షాలు ముంచెత్తుతుండటంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వారి సహాయార్థం టాలీవుడ్ సినీ లోకం కదలివస్తోంది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ భారీ విరాళాలు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగి ఎంతోమంది ఆశ్రయం కోల్పోయారు. దీంతో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విపత్కర పరిస్థితి చూసి వరద బాధితులను పెద్ద మనసుతో ఆదుకునేందుకు ముందుకొచ్చారు పలువురు టాలీవుడ్ ప్రముఖులు. వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్ లోకం.. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు భారీ విరాళాలు సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ ఎత్తున విరాళాలు అందించారు.తెలంగాణ సహాయ నిధికి తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు సినీ నటులు. ఇప్పటికే నందమూరి నట సింహం బాలకృష్ణ హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం కోటి 50 లక్షలు విరాళం ప్రకటించగా చిరంజీవి కోటి రూపాయల సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎవరికి వీలైనంతగా వాని సాయం చేయాల్సిందిగా కొడుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్.
భారీ వర్షాల వలన కలిగిన నష్టానికి చేయూతగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి సూపర్‌స్టార్ మహేష్‌బాబు కోటి రూపాయల విరాళం గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు, “తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్తు వల్ల సంభవించిన వినాశనం మనం ఊహించనిది. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తమ వంతు కృషి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి అభినందనలు. నా వంతు సాయంగా తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు అండగా వీలైనంత సహాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని అన్నారు.
వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ సీ ఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన కింగ్ అక్కినేని నాగార్జున కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తభించిపోయింది. బాధితులను ఆదుకోవడానికి కింగ్ అక్కినేని నాగార్జున వెంటనే స్పందించారు. రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసుని చాటుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీర్ ” భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.550 కోట్ల విడుదల చేయడం మంచి పరిణామం. నా వంతుగా రూ.50 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నాను” అన్నారు.
ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. మహేష్ బాబు కూడా కోటి విరాళం అందించనున్నట్లు తెలపగా.. ఎన్టీఆర్ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇకపోతే వరద బాధితుల తక్షణ పునరావాస కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుదల చేయడం సంతోషకరని పేర్కొన్న నాగార్జున 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తానని తెలిపారు. ఈ ఏడాదంతా చాలా ఇబ్బందికర పరిస్థితులు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ.. తన వంతుగా సీఎం రీలీఫ్ ఫండ్‌కు 10 లక్షలు ఇస్తున్నానని తెలిపారు. హారిక హాసిని ఎంటెర్టైమెంట్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి 10 లక్షలు ఇస్తున్నానని తెలిపారు. కష్ట సమయంలో చాలా మంది తమ వంతు సహాయసహకారాలను అందించారని కోరుతూ వరద బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సాయం చేద్దామని పిలుపునిచ్చారు. దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ లు కూడా బాధితులకు అండగా నిలుస్తూ చెరో 5 లక్షలు ప్రకటించారు.













