కరోనాకు థాంక్స్ చెప్పిన జగ్గు భాయ్!
అందరూ మహదారి మహమ్మారి ఈ కరోనా… చైనా నుండి దాపురించి మానవాళిని నాశనం చేస్తుంది దీని అంతు చూడండి అని ప్రపంచం అంటుంటే….. జగపతి బాబు మాత్రం దానికి థాంక్స్ చెపుతున్నాడు. ఎన్నో విజయవంతమైన కుటుంబ కథ చిత్రాలతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంతో చేరువయ్యారు జగపతి బాబు. అయితే హీరోగా ఆయనకు తగిన అవకాశాలు రాకపోవడం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేసి ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో పాటు….. సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా చేస్తున్న ఆయన ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్లోనే కాక, కోలివుడ్లో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్‌మీడియాలో కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూనే.. పలు సామాజిక అంశాలపై కూడా ఆయన స్పందిస్తుంటారు. అయితే విషయమేమిటంటే ప్రస్తుతం టాలీవుడ్లో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. ఇప్పటికే పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే అంతా కరోనాకు భయపడుతుంటే, జగపతిబాబు మాత్రం కరోనాకు థ్యాంక్స్ చెబుతున్నారు.
అసలు జగపతిబాబు కరోనాకు థ్యాంక్స్ చెప్పేందుకు గల కారణం ఏంటంటే….. తెలుగు సినీతెరపై ఒకప్పుడు మాన్లీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. తాజాగా జగ్గు భాయ్ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ అయింది. అందుకు కారణం ఆయన యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌కు థ్యాంక్స్ చెప్పడమే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్లలో పాల్గొనే వాళ్లు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎక్కువ శాతం ఎవ్వరిని దగ్గరకు రానివ్వకుండా తమ పనులు తామే చేసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ షూటింగ్‌లు ముగించుకుంటున్నారు. జగపతి బాబు కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు. మేకప్ మ్యాన్ అవసరం లేకుండా తనకు తానే మేకప్ చేసుకోవడం నేర్చుకున్నాను అంటూ ట్విట్టర్ లో జగపతిబాబు తాజా పోస్ట్ పెట్టారు. ఇది కరోనా కారణంగానే జరిగింది కాబట్టి….. దానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.













