నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ పై అల్లు అర్జున్ ప్రసంశలు
బింబిసార మూవీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. నందమూరి కళ్యాణ్ రామ్ అంటే తనకు ఎంతో గౌరవమంటూ ట్వీట్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార మూవీకి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ భారీగా వస్తోంది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె సినిమాను నిర్మించారు. కొత్త దర్శకుడు వశిష్ట టేకింగ్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మూవీ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా బింబిసార మూవీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బింబిసార మూవీ టీమ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు అల్లు అర్జున్ ఎప్పుడు ముందుంటారంటూ ప్రశంసించారు. అదేవిధంగా డైరెక్టర్ వశిష్టపై అభినందించారు. తొలి సినిమానే అద్భుతంగా తెరకెక్కించారని.. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా ఎఫెక్టివ్‌గా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీకి సరికొత్త సినిమాలు అందిస్తున్న కళ్యాణ్ రామ్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమే అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు బింబిసార మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజునే సినిమాకు రూ.7.08 కోట్లు షేర్ రాబట్టింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.52 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులు కలిపి వరల్డ్ వైడ్‌గా రూ.12.37 కోట్ల మేర వసూళ్లు కొల్లగొట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. మరో రూ.4 కోట్లు సాధిస్తే చాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్‌ను బట్టి చూస్తే.. ఆదివారానికే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు.













