రణ్వీర్ మళ్లీ ఆ డైరెక్టర్‌తోనే?
బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న డైరెక్టర్ ఆదిత్యధర్(Aditya Dhar), తాజా విజయాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారారు. కేవలం స్పై థ్రిల్లర్ జానర్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. ముఖ్యంగా ధురంధర్ ఫ్రాంచైజ్‌తో ఆయన సృష్టించిన కలెక్షన్ రికార్డులు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సెకండ్ పార్ట్ ధురంధర్: ది రివెంజ్(Dhurandhar: The Revenge) రిలీజైన తక్కువ రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించడం, టాప్ స్టార్ సినిమాలకు సవాల్ విసరడం విశేషంగా చెప్పుకోవాలి. దీంతో ఆయన కథ చెప్పే విధానం, ట్రీట్మెంట్పై సినీ వర్గాల్లో ప్రత్యేక దృష్టి పడింది.
ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా చేస్తారనే ప్రచారం నడిచినా, తాజా సమాచారం ప్రకారం ఆయన మళ్లీ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్(Ranveer Singh)తో చేతులు కలపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ మేళవించిన కథతో ఈ కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం. 2027 మార్చి నుంచి షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఉరి తర్వాత, ధురంధర్ సక్సెస్‌లతో వచ్చిన క్రేజ్‌ను మరింత పెంచేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలు ఆయనతో పనిచేయాలనే ఆసక్తి చూపుతున్నప్పటికీ, కథకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసే విషయంలో ఆదిత్యధర్ ఎలాంటి రాజీ పడకూడదనే నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన నెక్స్ సినిమా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








